![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -214 లో.. కృష్ణ బెస్ట్ జూనియర్ డాక్టర్ గా అవార్డు వచ్చినందుకు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. 'ప్రొద్దున పెద్ద అత్తయ్య లాగా చేసి ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ఈ అవార్డు తెచ్చుకొని తన విలువని పెంచుకుంది. నేను ఇలాగే ఉంటే నా విలువ తగ్గిపోతుంద'ని ముకుంద అనుకుంటుంది.
ఆ తర్వాత కృష్ణ తన గదిలోకి వెళ్లి.. తన అమ్మ నాన్న ఫొటోస్ చూస్తూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే మురారి వచ్చి కృష్ణతో మాట్లాడుతుంటాడు. కృష్ణ, మురారి త్వరగా కిందకి రండి అని భవాని పిలుస్తుంది. అత్తయ్య ఎప్పుడు కబురు పంపుతుంది. ఫస్ట్ టైం పిలిచింది వెళదాం పదండి ఏసీపీ సర్ అని మురారితో కృష్ణ అంటుంది. ఆ తర్వాత భవాని దగ్గరికి కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. కృష్ణ నీ కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయ్.. ఎందుకు ఏడుస్తున్నావని భవాని అంటుంది. ఏం లేదు పెద్దమ్మ కృష్ణ వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడింది, అందుకే అలా అని మురారి చెప్తాడు. ఆ విషయం వదిలేయండి మీరు ఎందుకు పిలిచారని భవానిని కృష్ణ అడుగుతుంది. మీరు ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళండి. కృష్ణకి ఏమైనా కొనివ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని మురారికి భవాని చెప్తుంది. మరి నువ్వు నీ భార్యకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదా అని మురారిని రేవతి అడుగుతుంది. ఇచ్చాను మమ్మీ కృష్ణకి కాదు అది అందరికి సర్ ప్రైజ్ అంటూ కృష్ణ కళ్ళు మూసుకోని బయటకు తీసుకొని వెళ్తాడు మురారి. కృష్ణ కి గిఫ్ట్ గా స్కూటీ ఇస్తాడు మురారి. అది చూసిన కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మురారిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత భవానిని కృష్ణ స్కూటీ పై తీసుకొని వెళ్తుంది. కాసేపటికి మురారితో కలిసి కృష్ణ షాపింగ్ కి వెళ్తుంది.
మరొకవైపు మధుని అలేఖ్య కొడుతుంటే.. ముకుంద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఎం లేదు కృష్ణకి షాపింగ్ అని లక్ష రూపాయలు ఇచ్చింది భవాని అత్తయ్య. మనకు ఒక పది వెయ్యిలు తెమ్మని అడిగితే వెళ్లట్లేదని అలేఖ్య చెప్పగానే.. ఏంటి వాళ్ళు షాపింగ్ కి వెళ్ళారా? ఇద్దరు వాళ్ళ లవ్ ని చెప్పుకుంటారేమో వెంటనే వెళ్లి ఆపాలని ముకుంద బయల్దేరి వెళ్తుండగా.. తనని చూసిన భవాని.. ముకుంద ఎక్కడికి అని అడుగుతుంది. అత్తయ్య మా అమ్మని చూడడానికని చెప్పి ముకుంద వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |